దేశీ కుక్కలను దత్తత తీసుకోండి : మంత్రి సీతక్క

దేశీ కుక్కలను దత్తత తీసుకోండి : మంత్రి సీతక్క
  • మూగ జీవాలను చంపితే చర్యలు: మంత్రి సీతక్క

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ దని, మూగజీవాలను హింసించడం కాంగ్రెస్  సిద్ధాంతం కాదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని కేబీఆర్ పార్క్‌‌‌‌లో జీహెచ్‌‌‌‌ఎంసీ ఆధ్వర్యంలో ఇండియన్ డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఓ స్వదేశీ కుక్క పిల్లను మంత్రి సీతక్క దత్తత తీసుకున్నారు.

అనంతరం ఎంపీ రేణుకా చౌదరి కూడా సీతక్క చేతుల మీదుగా మరో కుక్కపిల్లను అడాప్ట్ చేసుకున్నారు.  మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశీ కుక్కలను దత్తత తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో కుక్కలను చంపిన ఘటనలపై సీరియస్‌‌‌‌గా స్పందించారు. కుక్కలను చంపిన సర్పంచ్‌‌‌‌లపై చర్యలు తీసుకున్నామన్నారు.