సూది మొనపై నాగుపాము నీడలో శివయ్య..జగిత్యాల కళాకారుడి అద్భుత సృష్టి

సూది మొనపై  నాగుపాము నీడలో శివయ్య..జగిత్యాల కళాకారుడి అద్భుత సృష్టి

మహా శివరాత్రి  సందర్భంగా పంపకాల సూదిపై శివయ్య నాగుపాము సూక్ష్మ విగ్రహం తయారు చేశారు జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్.

శివరాత్రి సందర్భంగా ప్రపంచంలో ఎవరూ తయారు చేయని పంపకాల సూదిపై నాగుపాము పడిగే నీడలో కూర్చుని ఆశీర్వదిస్తున్నట్లు శివయ్య విగ్రహం రూపొందించారు.విగ్రహాం కోసం పంపకాల సూది, నైలాన్, పెన్సిల్ కలర్స్ వాడినట్లు దయాకర్ తెలిపారు. ఇలాంటి అద్భుతమైన విగ్రహాలను తయారు చేయుటకు  10 గంటల సమయం పట్టిందన్నారు దయాకర్.

గతంలోనూ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై సూక్ష్మ శివలింగంం తయారు చేశారు గుర్రం దయాకర్.  గుండు పిన్ను పై సూక్ష్మ శివలింగంతో పాటు ప్రకృతి అందాలను, మంచుపర్వతాలను రూపొందించారు. 

2025 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుండు సూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేసి ఆశ్చర్యపరిచాడు గుర్రం దయాకర్ .

చిన్న చిన్న వస్తువులపై సూక్ష కళాఖండాలను సృష్టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు గుర్రం దయాకర్. ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు.