లింగంపేట, వెలుగు : ఎల్లారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలో విజయోత్సవాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి సందడి చేశారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యే మదన్మోహన్రావు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రజలు మద్దతు తెలిపారన్నారు. కార్యక్రమంలో రఫియొద్దీన్, జొన్నల రాజు, సాయికుమార్, గాజుల ఏదుల్, గోపాల్, సిద్దూ, సర్పంచ్లు అట్టెం శ్రీనివాస్, కౌడ రవీందర్, కొమ్ముల రమేశ్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.
