
- అడ్వకేట్లు వినియోగదారుల చట్టం పరిధిలోకి రారు: సుప్రీం
న్యూఢిల్లీ : సేవలు బాగా లేవని లాయర్లపై దావా వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్వొకేట్లు వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్బెంచ్ పేర్కొంది. అడ్వకేట్లు, వారి సేవలు వినియోగదారుల రక్షణ చట్టం 1986 పరిధిలోకి వస్తాయని 2007లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)
ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బార్ సంఘాలు వేసిన పిటిషన్పై బెంచ్ విచారణ జరిపింది. వినియోగదారులకు సకాలంలో సమర్థవంతమైన సేవలు లభించేలా చేయడం, వివాదాలు పరిష్క రించడమే వినియోగదారుల రక్షణ చట్టం పని అని బెంచ్ పేర్కొంది.
వినియోగించుకున్న అడ్వకేట్ల సేవలు వ్యక్తిగత సేవల కిందకు వస్తాయని తెలిపింది. ‘‘న్యాయవాద వృత్తి ప్రత్యేక మైనది. అడ్వకేట్ల పనిస్వభావం కూడా ప్రత్యేకమైనదే. ఇతర వృత్తులతో న్యాయవాద వృత్తిని పోల్చలేం” అని బెంచ్ స్పష్టం చేసింది.