చెరువు మట్టితో పొలాల్లో పోషకాలు : ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య

చెరువు మట్టితో పొలాల్లో పోషకాలు : ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య

కారేపల్లి, వెలుగు: చెరువు మట్టిని పంట పొలాల్లో వేసుకోవడం వల్ల భూమిలో పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ఇరిగేషన్  డిపార్ట్​మెంట్  ఆధ్వర్యంలో అప్పాయి గూడెం చెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇరిగేషన్  డీఈ వెంకన్న, ఏవో అశోక్ కుమార్, సర్పంచ్  ప్రవీణ్  పాల్గొన్నారు.