టాటూలతో రక్తంలోకి విషం

టాటూలతో రక్తంలోకి విషం

అప్పట్లో ఒంటిపై పచ్చబొట్టు  పొడిపించుకునేటోళ్లు. ఇప్పుడది టాటూ అయింది. ఫ్యాషన్​గా మారింది. అయితే, ఆ టాటూలు డేంజర్​ అంటున్నారు సైంటిస్టులు.  కలర్‌‌‌‌ఫుల్‌‌గా, ఫ్యాషన్‌‌గా ఉంటాయేమో కానీ దానివల్ల రక్తంలోకి విషం పోతోందని ఫ్రాన్స్​ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.  రంగు‌‌ రావటానికి ఇంక్‌‌లో టైటానియమ్ డయాక్సైడ్‌‌ను కలుపుతారని, దాని వల్ల నికెల్‌‌, క్రోమియం వంటి రసాయనాలు కరిగి అవి శరీరంలోకి వెళ్తాయని, వాటివల్ల అలర్జీతో పాటు వివిధ రకాల సైడ్‌‌ ఎఫెక్ట్‌‌లు వస్తాయని చెప్పారు.కొందరి శరీరంలోని తెల్లరక్త కణాల్ని పరీక్షించినప్పుడు  మెటల్‌‌ కంటెంట్‌‌ కనిపించిందని, దాని వల్ల సూదుల్ని టెస్ట్‌‌ చేస్తే ఈ నిజాలు బయటపడ్డాయని సైంటిస్టులు తెలిపారు. టాటూలు డేంజరేనంటున్నారు.