పొలిట్ బ్యూరో, జాతీయ,రాష్ట్ర కమిటీలను ప్రకటించింది టీడీపీ. ఈసారి క్షేత్రస్థాయి నేతలకు పార్టీ పొలిట్ బ్యూరో, కమిటీల్లో గుర్తింపు కల్పించింది పార్టీ అధిష్టానం. పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది అధిష్టానం. దీంతో పార్టీలో లోకేష్ ప్రాధాన్యత మరింత పెరిగిందనే చెప్పాలి.
టీడీపీ పొలిట్ బ్యూరోలో 29 మంది, జాతీయ కమిటీలో 31 మంది, 185 మందితో రాష్ట్ర కమిటీలను ప్రకటించింది అధిష్టానం. అయితే, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను ప్రకటించింది టీడీపీ.
అంతే కాకుండా 14 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కో ఆర్డినేటర్లను కూడా ప్రకటించింది టీడీపీ. పార్టీ నాలెడ్జ్, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించింది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్న నేతలకు అవకాశం కల్పించినట్లు తెలిపింది పార్టీ అధిష్టానం.

