ఐదవ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి

ఐదవ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి

AP : విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. చింతలపూడి మండలంలోని ఓ ప్రైమరీ స్కూల్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.5వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేసిన టీచర్..స్పెషల్ క్లాస్ అంటూ అందరూ క్లాస్ నుంచి వెళ్లాక ఆమెను లైంగికంగా వేధించాడు. భయంతో బాలిక మూడు రోజులు స్కూల్ కి వెళ్లలేదు. అనుమానం వచ్చిన తల్లి బాలికను ఆరా తీయగా..అసలు విషయం చెప్పింది.

శరీరంపై ఉన్న గాయాలను తల్లికి చూపించింది. దీంతో పట్టరాని కోపంతో ఉన్న తల్లిదండ్రులు గ్రామస్థుల సాయంతో ..ఆ కీచక టీచర్ ను చితకబాదారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై  విచారణ జరపాలని మండల విద్యాశాఖాధికారిని ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే కీచకపర్వానికి ఒడిగట్టడంతో..అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. బాలికను హస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు గ్రామస్ధులు.