టీచర్స్ డే స్పెషల్ : గురుభ్యోనమః

టీచర్స్ డే స్పెషల్ : గురుభ్యోనమః

ఒక మనిషికి ఓ చేపని ఇస్తే వండుకుని తింటాడు. అది ఆ రోజు వరకే తృప్తి కలిగిస్తుంది. కానీ, ఆ చేపని సంపాదించడం ఎలాగో నేర్పిస్తే.. అది అతనికి జీవితాంతం కడుపు నింపుతుంది. జీవితాంతం తృప్తి కలిగిస్తుంది. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టడం ముఖ్యమే. కానీ, వాళ్లకు విద్య అందించడం అంతకన్నా ముఖ్యం. కాబట్టి, ఆ విద్యాదానం చేసే గురువు ఎంత గొప్పవాడో శిష్యుని మనసులో ఉండే అతని స్థానం చెప్తుంది.

ఎంతోమంది గురువులు స్వార్థం లేకుండా తమ జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నారు కాబట్టే, తరతరాలుగా జ్ఞాన ప్రవాహం కొనసాగుతోంది.
ఇదంతా గురువుల భిక్షే! ఈ సమాజ భవిష్యత్తుకి పునాదులు వేసే ఏకైక ప్రొఫెషన్‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌ మాత్రమే! గురువు ఎలా ప్రభావితం చేశాడనే
దాన్ని బట్టే.. సమాజ భవిష్యత్తు నిర్మాణమవుతుంది.