బెంగాల్ లో బహిరంగ తరగతులతో బోధన

బెంగాల్ లో బహిరంగ తరగతులతో బోధన

కరోనా కారణంగా విద్యార్థులు చదువుకు దూరమౌతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులకు, చదువుకు మధ్య తేడా పెరిగిపోయింది. ఈక్రమంలో.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బహిరంగ తరగతి గదులను ఏర్పాటు చేసి పాఠాలు బోదించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యాసంస్థలు తెరవాలంటూ ఇటీవల దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా 2020 మార్చి నుంచి బెంగాల్ లో పాఠశాలలు తెరవలేదు. కేవలం 9, 10 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతిస్తూ పలు ప్రాంతాల్లో పాక్షికంగా ప్రభుత్వ-ప్రైవేటు స్కూళ్లు  తెరిచారు. అయితే మధ్యలో ఎన్నికలు, రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసలు మొత్తానికే  స్కూళ్లు మూసివేసింది ప్రభుత్వం. దీంతో విద్యార్థులు చదువులకు దూరం అయ్యారు. ఆన్ లైన్ తరగతులు కొనసాగుతున్నా..అవి అన్ని వర్గాల విద్యార్థులకు అవి అందుబాటులో లేవు.

ఈ వ్యత్యాసాన్ని గమనించిన బెంగాల్ విద్యాశాఖ అధికారులు.. పాఠశాలలు తెరవకపోతే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ప్రభుత్వానికి నివేదించింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత నిస్తూ బహిరంగ తరగతులు నిర్వహించేలా కమ్యూనిటీ పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులందరూ ఏక కాలంలో ప్రత్యక్ష తరగతులకు హాజరుకావొచ్చు. ఇవాళ్టి నుంచి  (జనవరి 24) నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈతరహా బహిరంగ తరగతుల్లో బోధన ప్రారంభించగా..ఇది విజయవంతం కావడంతో  మిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహా తరగతి గదులు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది బెంగాల్ ప్రభుత్వం.

మరిన్ని వార్తల కోసం...

'విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా స్మృతి