'విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా స్మృతి

'విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా స్మృతి

దుబాయ్: టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన మరో ఘనతను సాధించింది. 2021 ఏడాదికి గానూ ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ మహిళా క్రికెటర్ గా నిలిచింది. ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ పురస్కారాన్ని గెల్చుకుంది. గతేడాది భారత జట్టు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ స్మృతి మాత్రం అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఓవరాల్ గా గతేడాది భారత్ తరపున 22 మ్యాచుల్లో బరిలోకి దిగిన ఈ లెఫ్టార్మ్ ప్లేయర్.. 38.86 సగటుతో 855 రన్స్ చేసింది. ముఖ్యంగా పటిష్టమైన ఆస్ట్రేలియా టీమ్ తో ఆడిన సిరీస్ లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో కంగారూ బౌలర్లను ఓ ఆటాడుకుంది. పింక్ బాల్ టెస్టులో చేసిన సెంచరీ ఆమె కెరీర్ ఆసాంతం గుర్తుంటుందని చెప్పొచ్చు.

మరిన్ని వార్తల కోసం..

విరాట్ కోహ్లీ పెళ్లిపై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

ఒమిక్రాన్​ కమ్యూనిటీ స్ప్రెడ్​ మొదలైంది

కరోనా పేషంట్లకు షాక్.. కొత్త టెస్ట్ పేరుతో దోపిడీ