
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కాడు. వడోదరలో అక్షర్ పటేల్ వివాహం తన ప్రేయసి మెహా పటేల్‌తో ఘనంగా జరిగింది. గురువారం జరిగిన ఈ వేడుకలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదంతో ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అక్షర్ కి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అక్షర్ గతేడాది తన పుట్టినరోజున మెహా చేతికి ఉంగరం తొడిగి పెళ్ళికి ప్రపోజ్ చేశాడు. ఏడాది పాటు ప్రేమలో మునిగి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. మెహా పటేల్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్‌గా పనిచేస్తుంది. రెండు వారాలు విరామం తీసుకున్న తర్వాత అక్షర్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు తిరిగి జట్టులో చేరుతాడు.