బషీర్‌బాగ్, వెలుగు: ‘తెలంగాణ మా అయ్యల జాగీరే’ అని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పవన్ కు తెలంగాణపై మొదటి నుంచి విద్వేషం ఉందని ఆరోపించారు. ఆయన వెనక బీజేపీ, టీడీపీ ఉన్నాయన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, నాయకులు వెంకన్న గౌడ్, విజయ్ కుమార్, దుర్గయ్య గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
