తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపుతో పాటు న్యాయం జరగాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్  కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాద్​ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం’పై నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. పదేండ్లలో ఉద్యమకారులను అణచి వేసే ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు. 

ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అందరికీ న్యాయం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ ఆశయాల సాధన కోసం అవసరమైతే మళ్లీ పోరాటం చేస్తామని , తొలిదశ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి,  సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాసం సత్యనారాయణ, రాములు నాయక్, పాశం యాదగిరి, ముక్కాల సాంబశివరావు, కేవీ రంగారెడ్డి, పల్లె వినయ్ కుమార్, శ్రవణ్ కుమార్ గుప్తా, బిరెల్లి వెంకటరెడ్డి, కొత్త రవికుమార్, మహేందర్ యాదవ్, కూర రమేశ్, వెంకటాచారి, సువర్ణ పాల్గొన్నారు.