ఉద్యమకారులను ఆదుకోవాలి.. రూ.వెయ్యి కోట్లతో తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఉద్యమకారులను ఆదుకోవాలి.. రూ.వెయ్యి కోట్లతో తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి
  •     టఫ్​ నాయకురాలు విమలక్క

పంజాగుట్ట, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రూ.వెయ్యి కోట్లతో తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టఫ్) నాయకురాలు విమలక్క డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో ఉద్యమ నాయకులు భగవంత్ రెడ్డి, టి.మన్మాండ్లు, మన్నారం నాగరాజు, ప్రొఫెసర్​ గాలి వినోద్ కుమార్‌‌ తో కలిసి ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి టఫ్ రూపొందించిన ప్రతిపాదనల లేఖను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన 15 ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్లు పేర్కొన్నారు.