- జలమండలి ఎండీ ముందస్తు చర్యలకు సర్కార్ ఓకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్‌లోని టిమ్స్ హాస్పిటల్స్‌కు వాటర్ సప్లై, డ్రైనేజీ కనెక్షన్ల కోసం మొత్తం రూ. 13.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సనత్ నగర్ టిమ్స్ నీటి సరఫరా పనుల కోసం అత్యధికంగా రూ.7 కోట్లు, అల్వాల్ టిమ్స్ కోసం రూ. 1.50 కోట్లు కేటాయించగా, ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్‌కు నీటి సరఫరా, డ్రైనేజీ పనుల కోసం చెరో రూ. 2.50 కోట్ల చొప్పున మొత్తం రూ. 5 కోట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పనులకు సంబంధించి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న ముందస్తు చర్యలను ప్రభుత్వం సమర్థిస్తూ రాటిఫికేషన్ ఉత్తర్వులు ఇచ్చింది.
