హైదరాబాద్ నగరంలోని ఐమాక్స్ సర్కిల్ ఎదురుగా, లేక్ వ్యూ పార్క్ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం హెచ్‌ఎండీఏ (HMDA) గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ,నాయకులు పాల్గొన్నారు.
