Starc vs Miraz: ఆస్ట్రేలియా క్రికెటర్లకు మైదానంలో ఎదుటి జట్టు గెలిచే అవకాశం ఉందంటే చాలు ఎక్కడలేని కోపం ఒక్కసారిగా వారికి వస్తుంది. తమ మాట వినకపోతే గ్రౌండ్ లోనే లొల్లి స్టార్ట్ చేస్తారు. మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించలేనప్పుడు ఏదో ఒక చిన్న కారణంగా వివాదాన్ని స్టార్ట్ చేయడం ఆసీస్ మామలకు అలవాటే. తాజాగా డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా సరిగ్గా ఇదే జరిగింది. బంగ్లా బ్యాటర్లను అవుట్ చేయలేక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. పిచ్‌పై పరిగెత్తావంటూ బంగ్లా ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్‌ని బెదిరించాడు.
పిచ్ నీ అబ్బ సొత్తా ఏమైనా?:
స్టార్క్ వేసిన 21వ ఓవర్‌లో ఈ -హైడ్రామా స్టార్ట్ అయింది. మెహిదీ హసన్ పాయింట్ దిశగా ఒక షాట్ ఆడి రన్ రన్ అంటూ వికెట్ల మధ్య పరుగెత్తాడు. అంతా బాగానే ఉంది కానీ, బంతిని చూస్తూ పరిగెత్తే హడావుడిలో అతడు పిచ్ మధ్యలో ఉన్న రక్షిత ప్రాంతం (Danger Zone) పై కాలు పెట్టేశాడు. ఇంకేముంది, అక్కడ విజిలింగ్ చేస్తున్న అంపైర్ కుమార ధర్మసేన వెంటనే ఏయ్ తమ్ముడూ.. పిచ్ పాడవుతుంది, పక్కకి పో అని హెచ్చరిక జారీ చేశాడు. వికెట్లు పడక అప్పటికే లోపల రగిలిపోతున్న స్టార్క్‌కు అంపైర్ ఇచ్చిన ఈ హింట్ ఒక మంచి ఆయుధంలా దొరికింది.
ఇది బంగ్లాదేశ్ కాదు.. చూస్కోని పరుగులు తీయ్:
పిచ్ మధ్యలో పరిగెత్తున్న మెహిదీ దగ్గరకు దూసుకొచ్చిన మిచెల్ స్టార్క్.. తన ఆటిట్యూడ్ బయటకు తీశాడు. ఇలా అంటున్నాడు.
స్టార్క్: హేయ్ ఇది నా ఫాలో త్రూ.. ఇప్పుడు నీ ఫాలో త్రూ నడుస్తోంది. పిచ్ మీది నుంచి పక్కకు తప్పుకో అంటూ గట్టిగా కేకలు వేశాడు.
హసన్ మిరాజ్: బ్రో.. నేను బంతి ఎటు వెళ్తుందో చూస్తున్నా.. నువ్వు వస్తున్నావని నాకు కనపడలేదు.. ఐ డిడెంట్ సీ అని అమాయకంగా ఎక్స్‌క్యూజ్ చెప్పాడు.
అమాయకపు సమాధానంతో స్టార్క్‌కు ఎక్కడో కాలిపోయింది. తన బౌలింగ్ మార్క్ వైపు నడుస్తూ ముఖం మాడ్చుకుని.. నువ్వు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో లేవు తమ్ముడూ.. గుర్తుంచుకో అంటూ స్లెడ్జింగ్ చేసేశాడు. దీంతో ఇరువురి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.
నోటితో ఆసీస్ రచ్చ.. బ్యాట్‌తో బంగ్లా దంచుడే దంచుడు:
మిచెల్ స్టార్క్ ఎంత ఆవేశపడినా, మైండ్ గేమ్‌లు ఆడదామని చూసినా.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం నువ్వు అరుస్తూ ఉండు మావా.. మేం కొడుతూ ఉంటాం అన్నట్లుగానే వ్యవహరించారు. డార్విన్ పిచ్‌పై బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్ తమీమ్ తన కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీతో ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు ఆస్ట్రేలియా కొంపముంచి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది.
"Get off the wicket!"
— cricket.com.au (@cricketcomau) August 14, 2026
Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8
