మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి.  ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. రెండు వారాలపాటు జరగనున్న ఈ సమావేశాలు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్ర్రారంభంకానున్నాయి.

మార్చి 8వ తేదీన ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు.