గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలోకి..ప్రధాన పార్టీల క్యాండిడేట్లు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలోకి..ప్రధాన పార్టీల క్యాండిడేట్లు
  •     బీఆర్ఎస్ సిట్టింగులకే టికెట్లు కన్ఫార్మ్
  •     కాంగ్రెస్ రెండో జాబితాలో మరికొందరు ఖరారు
  •     ఇంకా మూడో జాబితా ప్రకటించని బీజేపీ 

హైదరాబాద్,వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​హైదరాబాద్ ​పరిధిలోని అసెంబ్లీ  సెగ్మెంట్ల నుంచి పోటీ చేసే కాంగ్రెస్​ అభ్యర్థులు రెండో జాబితాలో మరికొందరు  ఖరారయ్యారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్​ రెండో జాబితా ప్రకటించగా కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగింది . దీంతో ఇక ప్రచారంలో దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటివరకు గ్రేటర్​ పరిధిలోని రెండు స్థానాల్లో మినహా అన్ని చోట్ల సిట్టింగ్​లకే  బీఆర్ఎస్ టికెట్లు కన్ఫార్మ్ చేసింది. ఇక బీజేపీ కూడా ఇప్పటికే మొదటి జాబితాలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్​ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.