విజయ పాలకు తెలంగాణ బ్రాండ్

విజయ పాలకు తెలంగాణ బ్రాండ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విజయ పాలు ఇక తెలంగాణ బ్రాండ్‌‌‌‌గా మార్కెట్‌‌‌‌లోకి రానున్నాయి. విజయ తెలంగాణ బ్రాండ్ కు కేంద్ర ప్రభుత్వ  సంస్థ  రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫ్‌‌‌‌  ట్రేడ్‌‌‌‌ మార్క్ అనుమతినిచ్చింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లకు ఒకే బ్రాండ్ తో విజయ  పాలు, పాల ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి.

దీంతో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ విజయ తెలంగాణ లోగో ను ప్రత్యేకంగా రూపొందించి ట్రేడ్​మార్క్​అథారిటీని సంప్రదించింది. ఆ సంస్థ ట్రేడ్ మార్క్ యాక్టు 1999 ప్రకారం ఈ బ్రాండ్​ను రిజిస్టర్​చేసి సర్టిఫికేట్​జారీ చేసింది.