రాష్ట్ర అధికార గీతంగా జయ జయహే తెలంగాణ..కేబినెట్ నిర్ణయాలు ఇవే..

రాష్ట్ర అధికార గీతంగా జయ జయహే తెలంగాణ..కేబినెట్ నిర్ణయాలు ఇవే..

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లో మరో రెండు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ లో  టీఎస్ ను టీజీ గా మారుస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక రాష్ట్ర అధికారిక గేయంగా జయజయహే తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహా  రూపంలో, తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులకు  కేబినెట్ ఆమోదం తెలిపింది.    అలాగే ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ ..గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది.