కేబుల్ టీవీ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

కేబుల్ టీవీ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

బషీర్​బాగ్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ కన్వీనింగ్, నిర్వహణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో కమిటీ ప్రతినిధులు బి.నరసింహాచారి, బరిగెల శివ, యాసిఫ్ పాషా, పొదుల్ల వెంకట్ మాట్లాడుతూ.. కేబుల్ టీవీ జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి హోదా కార్డులు ఇవ్వాలని, నెట్​వర్క్ ఉన్న ప్రతి జిల్లాలో ఆరు కార్డులకు అవకాశం కల్పించాలని కోరారు. కేబుల్ టీవీలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంతో పాటు జిల్లాల్లో స్టూడియోల నిబంధనలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి కేబుల్ టీవీకి అసెంబ్లీ పాస్​లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.