తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నెట్‌వర్క్‌పై తెలంగాణ సీఐడీ విభాగం కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఈ భారీ ముఠాకు చెందిన 11 మంది నిందితులను అధికారులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు.
ఈ ముఠా నెట్‌వర్క్ చాలా పెద్దదని, అరెస్ట్ అయిన వారిలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కేటుగాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. పక్కా ప్లాన్‌తో దాడి చేసిన సీఐడీ బృందం.. బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారులతో పాటు, వారికి సహకరిస్తున్న అసిస్టెంట్లను కూడా పట్టుకుంది.
భారీగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ స్వాధీనం
నిందితుల స్థావరాల నుంచి బెట్టింగ్ నిర్వహణకు ఉపయోగించే కీలక పరికరాలను అధికారులు సీజ్ చేశారు.భారీ సంఖ్యలో ,బెట్టింగ్ అకౌంట్స్ ఆపరేట్ చేసే ల్యాప్‌టాప్‌లు,నిర్వహణకు వాడే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మీడియా ముందుకు నిందితులు..
ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల గుట్టును త్వరలోనే సీఐడీ డీజీ చారు సిన్హా కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అసలు ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎంత డబ్బు చేతులు మారింది? అనే విషయాలు తేలనున్నాయి.
