హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగుపర్చేందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంచిర్యాల, నల్గొండ, మెదక్ జిల్లాల్లో రోడ్ల వెంట ఉన్న అటవీ భూముల్లో భూగర్భ ఫైబర్ కేబుళ్లు వేసేందుకు అనుమతులు ఇచ్చింది.రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ వేర్వేరుగా మూడు జీవోలు జారీ చేశారు.
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అటవీ సంరక్షణ చట్టం-1980 కింద ఇచ్చిన అనుమతుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్(టీ-ఫైబర్)కు కూడా ఈ అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులతో ఆయా జిల్లాల్లో నెట్‌వర్క్ విస్తరణ వేగవంతం కావడంతో పాటు ఇంటర్నెట్ సేవలు మెరుగయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
