సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజు వారీ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా  రోజు వారీగా 4 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనకు స్వల్ప లక్షణాలున్నాయని.. గజ్వేల్  సమీపంలోని ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు.