తెలంగాణలో డ్రగ్స్ మాఫియాపై కొరడా ఝులిపించారు ఈగల్ పోలీసులు.అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేస్తూ సంచలన ఆపరేషన్ చేపట్టారు. థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కోట్ల రూపాయల హైడ్రోపోనిక్ గంజాయి రవాణాను ఈగల్ ఫోర్స్ విజయవంతంగా అడ్డుకుంది. ఈ భారీ నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్న ఒక కీలక విదేశీ మహిళతో పాటు, మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుండి అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 12 కోట్ల రూపాయల విలువ చేసే భారీ హైడ్రోపోనిక్ గంజాయిని ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. గత నెల రోజులుగా అత్యంత రహస్యంగా, పక్కా ప్లానింగ్‌తో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఈగల్ ఫోర్స్.. ఎట్టకేలకు ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా నెట్‌వర్క్‌ను పూర్తిగా చేధించింది.
ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల ముఠా గుట్టును వివరిస్తూ.. జూన్ 4 మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఈగల్ పోలీసులు అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
