భారీ ఆధిక్యంలో వివేక్ బ్రదర్స్

భారీ ఆధిక్యంలో వివేక్ బ్రదర్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. రెండో రౌండ్ ముగిసే సమయానికి.. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి 12 వేల ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు 5 వేల 800 ఓట్లు మాత్రమే పడ్డాయి. 

ఇక బెల్లింపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సమయానికి దుర్గం చిన్నయ్యపై 6 వేల 400 ఓట్ల ఆధిక్యంగా కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ముందున్నారు. వివేక్ బ్రదర్స్ ఇద్దరూ రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి.. భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.