కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే..

కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే..

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరనున్నారు.దివంగత ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అవనున్నారు. 

కాంగ్రెస్ పార్టీలోకి సీతా దయాకర్ రెడ్డి , ఆమె కుమారులు కొత్త కోట సిధార్థ రెడ్డి , కార్తీక్ రెడ్డి తోపాటు పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు  
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజక వర్గాల నుంచి సీతా దయాకర్ రెడ్డి నాయకులు, అనుచరులు  గాంధీ భవన్ తరలివస్తున్నారు.