- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవి ర్భావమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు గవర్నర్ శుభా కాంక్షలు తెలిపారు.
తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వం రాష్ట్రానికి జీవనాడి లాంటివని గవర్నర్ కొనియాడారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల నుంచి ఆధునీక సాగునీటి ప్రాజెక్టుల వరకు తెలంగాణ రైతాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
