- 16 మందికి మహోన్నత సేవా పతకాలు ప్రకటించిన హోం శాఖ
- విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందించిన వారితో పాటు ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అగ్నిమాపక శాఖ సిబ్బందికి మొత్తం ఐదు కేటగిరీల్లో కలిపి 632 మందికి పతకాలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పోలీస్ పతకమైన తెలంగాణ సీఎం సర్వోన్నత పోలీస్ పతకం జెన్‌కో చీఫ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న అదనపు ఎస్పీ డి.ప్రతాప్‌కు దక్కింది. తెలంగాణ శౌర్య పతకం (10), ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ పర్నే సత్యనారాయణ సహా 16 మందికి తెలంగాణ మహోన్నత సేవా పతకం వరించింది. తెలంగాణ ఉత్తమ సేవా పతకం (94), తెలంగాణ కఠిన సేవా పతకం (50), తెలంగాణ సేవా పతకం (461) కేటగిరీల్లో పతకాలు ప్రకటించారు.
హైదరాబాద్, వెలుగు: పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పోలీస్ పతకమైన తెలంగాణ సీఎం సర్వోన్నత పోలీస్ పతకం జెన్‌కో చీఫ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న అదనపు ఎస్పీ డి.ప్రతాప్‌కు దక్కింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్ ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు. పోలీసు విధుల్లో డి.ప్రతాప్ ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, అంకితభావం, అత్యుత్తమ సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. ఈ మొత్తం ఒకేసారి చెల్లించే ప్రత్యేక నగదు బహుమతిగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా విజేతలను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు.
ఐదు కేటగిరీల్లో పతకాలు..
పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందించిన వారితో పాటు ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అగ్నిమాపక శాఖ సిబ్బందికి మొత్తం ఐదు కేటగిరీల్లో కలిపి 632 మందికి పతకాలు ప్రకటించారు. ఇందులో తెలంగాణ శౌర్య పతకం (10), ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ పర్నే సత్యనారాయణ సహా 16 మందికి తెలంగాణ మహోన్నత సేవా పతకం వరించింది. తెలంగాణ ఉత్తమ సేవా పతకం (94), తెలంగాణ కఠిన సేవా పతకం (50), తెలంగాణ సేవా పతకం (461) కేటగిరీల్లో పతకాలు ప్రకటించారు. తెలంగాణ శౌర్య పతకం దక్కిన వారికి ఒకేసారి రూ.10 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రతి నెలా వేతనంలో రూ.500 చొప్పున అందజేయనున్నారు. మహోన్నత సేవా పతకం దక్కిన వారికి ఒకేసారి రూ.40 వేలు, ఉత్తమ సేవా పతకం దక్కిన వారికి ఒకేసారి రూ.30 వేలు, కఠిన సేవా పతకం దక్కిన వారికి ఒకేసారి రూ.20 వేలు, సేవా పతకం దక్కిన వారికి ఒకేసారి రూ.20 వేల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.
