- తెలంగాణ గోశాల సమాఖ్య
బషీర్ బాగ్, వెలుగు: గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలుచేయాలని తెలంగాణ గోశాల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు మహేశ్అగర్వాల్ డిమాండ్ చేశారు. ఏటా బక్రీద్ టైంలో వేలాది గోవులను వధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన హైదర్‌గూడలో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ 540 చట్టం ప్రకారం సిటీకి పశువులను తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు.
గతంలో బక్రీద్ పండుగకు 15 రోజుల ముందు నుంచే సిటీ సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టే పోలీసులు, ఈసారి ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాతబస్తీలోని చాలా ప్రాంతాలకు వేల పశువులను అక్రమంగా తీసుకొచ్చారని ఆరోపించారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ వ్యవహరించడం దారుణమన్నారు. జంతు సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలుచేయకుంటే డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని మహేశ్ అగర్వాల్
హెచ్చరించారు.
