ఆర్మూర్, వెలుగు: బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన వీర జవాన్ ఎర్రం నర్సయ్య ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరైంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొటార్మూర్ శివారులో 300 గజాల ఇంటి స్థలం మంజూరవగా, పత్రాలను కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం జవాన్ తల్లి ఎర్రం కళావతికి అందజేశారు. నాయకులు రమేశ్, గంగూలి, జిమ్మి రవి, గంగాధర్, వాసు పాల్గొన్నారు.
