రాజన్న సిరిసిల్ల/కోనరావుపేట, వెలుగు: మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. అంతకుముందు కోనరావుపేట మండలం బావుసాయిపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ చెక్కులను చెక్కులను పంపిణీ చేశారు.
కోరుట్ల: కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
