బీఆర్‌‌ఎస్‌‌ సభ అనుమతుల రద్దు సరికాదు : హైకోర్టు

బీఆర్‌‌ఎస్‌‌ సభ అనుమతుల రద్దు సరికాదు : హైకోర్టు
  •     గొల్లపల్లి సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్, వెలుగు: వనపర్తి జిల్లా గొల్లపల్లిలో ఈ నెల 9న (గురువారం) బీఆర్‌‌ఎస్ నిర్వహించే  బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్పీ ఇచ్చిన అనుమతులను ఎస్పీ రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కోర్టు.. సభ నిర్వహణకు సహకరించాలని పోలీసులను ఆదేశించింది. సభకు హాజరయ్యేవారి సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా భద్రతా సిబ్బందిని పెంచి సభ సజావుగా జరిగేలా చూడాలి కానీ, ఏకంగా అనుమతులు రద్దు చేయడం సరికాదని పేర్కొంది. 

బీఆర్ఎస్ సభకు డీఎస్పీ అనుమతి ఇవ్వగా .. 7 నుంచి 10 వేల మంది వచ్చే అవకాశం ఉందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పేర్కొంటూ అనుమతి ఉత్తర్వులను ఎస్పీ రద్దు చేశారు. దీనిపై బీఆర్‌‌ఎస్ నేత గట్టు యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. వాదనల విన్న కోర్టు.. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది.