హైదరాబాద్, వెలుగు: కార్పొరేషన్లు, ఫెడరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఎట్టకేలకు ఛాంబర్లు ఖరారయ్యాయి. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) బిల్డింగ్‌లో వీరికి ఛాంబర్లను కేటాయించారు. బీసీ వెల్ఫేర్ అనుబంధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లలో మొత్తం 9 మంది చైర్మన్లు, మరో 9 మంది వైస్ చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వీరంతా మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
ఇందులో ఇద్దరు చైర్మన్లకు మాత్రమే సంక్షేమ భవన్‌లో ఛాంఈఈబర్లు కేటాయించారు. మిగతా వారికి కేటాయించడానికి స్థలం లేకపోవడంతో.. 20 రోజులుగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్వేషిస్తున్నారు. మొదట బీఆర్కే భవన్‌లో కేటాయించాలని భావించినప్పటికీ, అక్కడ ఖాళీ లేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు బిల్డింగ్స్‌ను పరిశీలించారు. కానీ, అవి చాలా పాతవి కావడంతో అధికారులు వెనకడుగు వేశారు. చివరకు ఐడీసీ ఆఫీస్ బిల్డింగ్‌ను ఫైనల్ చేశారు.
