తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 92 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ప్రవర్తన, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, జైలులో వారి ప్రవర్తనా తీరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖైదీలను విడుదల చేయనున్నారు. వీరిలో 86 మందిరు పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మానవతా దృక్పథంతో రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లనుంచి అర్హులైన ఖైదీలకు ఈ క్షమాభిక్ష వర్తించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖైదీల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఖైదీల విడుదల ప్రక్రియను జైలు శాఖ అధికారులు త్వరలో పూర్తి చేయనున్నారు.
