లక్డీకాపూల్​లో 9 అడుగుల రోశయ్య విగ్రహం .. ఏర్పాటుకు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ

లక్డీకాపూల్​లో 9 అడుగుల రోశయ్య విగ్రహం .. ఏర్పాటుకు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్ సర్కిల్​లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య 9 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన పనులను జీహెచ్ఎంసీ చూస్తోంది. 

బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తోంది. 450 కిలోల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సీఎం చేతులమీదుగా ఆవిష్కరించనున్నారు.