హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా నిర్వహణ, మౌలిక వసతులు, కార్యాచరణ వ్యయాల కోసం రూ.72 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజాగా విడుదల చేసిన నిధులతో ‘హైడ్రా’ వ్యవస్థాపక, నిర్వహణ ఖర్చులతో పాటు అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలు, సిబ్బంది వేతనాలు, ఇతర అత్యవసర వాహనాలను కొనుగోలు చేయనున్నారు.
మరోవైపు చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు నగరంలో విపత్తు నిర్వహణ చర్యలను మరింత వేగవంతం చేసేందుకే ఈ నిధులు విడుదల చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది.
