హైదరాబాద్‌సిటీ, వెలుగు: క్యూర్పరిధిలో ఆటోమేటిక్మీటర్ల కొనుగోలు కోసం వాటర్‌బోర్డుకు రూ.31.70 కోట్లను మంజూరు చేస్తూ మున్సిపల్‌శాఖ పరిపాలనా అనుమతులను జారీ చేసింది.
మూడు కార్పొరేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో 25 ఎంఎం(1/2 అంగళం) కనెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. అలాగే, వాటర్‌బోర్డు ఇంతకుముందు అమర్చిన ఆటోమేటిక్మీటర్లు చాలా వరకు పని చేయడం లేదు. దీంతో సగటు బిల్లులను జారీ చేస్తుండడంతో ఆదాయం తగ్గుతోంది.
ఈ నేపథ్యంలో ఏఎంఆర్మీటర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపగా, ఓకే చెప్పారు. ఇప్పటికే 6,940 మంది కస్టమర్ల నుంచి ఏఎంఆర్ మీటర్ల బిగింపు కోసం వసూలు చేసిన రూ.33 కోట్లు బోర్డు దగ్గరే ఉన్నాయి. వీటితో పాటు రూ.31.70 కోట్లను మంజూరు చేస్తూ మున్సిపల్‌శాఖ పరిపాలనా అనుమతులను జారీ చేసింది. త్వరలో ఈ-ప్రొక్యూర్మెంట్ద్వారా మీటర్లు కొనాలని ఆదేశించింది.
