దేవాదాయ శాఖలో అదనపు కమిషనర్లకు బదిలీలు..జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం

దేవాదాయ శాఖలో అదనపు కమిషనర్లకు బదిలీలు..జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర దేవాదాయశాఖలో ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. పరిపాలనా కారణాలతో అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ (దేవాదాయ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ ఆఫీస్ అదనపు కమిషనర్‌‌గా ఉన్న  కృష్ణవేణిని దేవాదాయ ట్రిబ్యునల్ మెంబర్‌‌గా బదిలీ చేశారు. ట్రిబ్యునల్‌‌లో ఉన్న  కె. జ్యోతిని హెడ్ ఆఫీస్ అదనపు కమిషనర్‌‌గా నియమించారు.

హైదరాబాద్ కమిషనరేట్‌‌లో పనిచేస్తున్న డి. కృష్ణ ప్రసాద్‌‌ను వరంగల్ డిప్యూటీ కమిషనర్‌‌గా బదిలీ చేశారు. హైదరాబాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. ఓంప్రకాశ్ రావును హెడ్ ఆఫీస్‌‌కు బదిలీ చేయగా.. అక్కడ పనిచేస్తున్న వి. శ్రీనివాస శర్మను హైదరాబాద్ డివిజన్‌‌కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలు చేపట్టాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ డైరెక్టర్‌‌ను ప్రభుత్వం ఆదేశించింది.