హైదరాబాద్, వెలుగు: హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన జస్టిస్ పి.శ్యామ్ కోశీని హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ శుక్రవారం సన్మానించింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ శ్యామ్ కోశీ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు బార్, బెంచ్ మధ్య సత్సంబంధాలు, పరస్పర సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పి.శ్రవణ్ కుమార్ గౌడ్, జాయింట్ సెక్రటరీ పి.కృష్ణ కీర్తన పాల్గొన్నారు.
