ఓయూ, వెలుగు: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసోర్స్ రికవరీ రంగంలో కృషి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్సి. శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మక ‘ఛేంజ్ మేకర్’ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ప్రముఖ పర్యావరణ సంస్థ ‘సాహస్’ 25వ వార్షికోత్సవంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.
ఓయూ క్యాంపస్‌లో అతి తక్కువ కాలంలో 2 టన్నుల కెపాసిటీ సామర్థ్యం ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి, 800 రోజులకు పైగా నిరంతరాయంగా నడిపించారు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న బయోగ్యాస్ ను ఓయూ కిచెన్‌లో ఫ్యూయెల్ (గ్యాస్) గా ఉపయోగిస్తుండగా, మిగిలిన పోషక విలువలతో కూడిన వేస్టేజ్ ను క్యాంపస్ గార్డెన్స్‌కు (తోటలకు) ఆర్గానిక్ మెన్యూర్ (సేంద్రీయ ఎరువు)గా వాడుతున్నారు. ప్రొఫెసర్ శ్రీనివాసులును వీసీ ప్రొఫెసర్కుమార్ మొలుగురం అభినందించారు.
