ముంబై: సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నిధులు సమీకరించిన ప్రైమరీ మార్కెట్ ఈ నెలలోనూ జోరు కొనసాగిస్తోంది. జులై–సెప్టెంబరు మధ్య 70 మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్ల నుంచి రూ.90,500 కోట్లు సమీకరించాయి.
దీపావళికి ముందే దాదాపు డజను ఐపీఓలు రూ.50 వేల కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఈ జాబితాలో రిలయన్స్ జియో, అవాడా ఎలక్ట్రో, కార్ల్స్‌బర్గ్ ఉన్నాయి. జియో రూ.32వేల కోట్లు సమీకరించేందుకు అక్టోబరు 21న ఐపీఓ తెచ్చే అవకాశం ఉంది.
ప్రైస్‌బ్యాండ్ రూ.1,065-–రూ.1,119 మధ్య ఉంటుందని సమాచారం. అవాడా ఎలక్ట్రో రూ.7,600 కోట్లు, కార్ల్స్‌బర్గ్ ఇండియా రూ.6,500 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. హెచ్డీ ఫైర్ సిస్టమ్స్, ఫ్యూజన్ సిస్టమ్స్ ఐపీఓలు అక్టోబరు 13, 14 తేదీల్లో ప్రారంభమై రూ.1,414 కోట్లు సమీకరించనున్నాయి. సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, జెట్‌వర్క్ పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.5,500 కోట్లు సమీకరించనున్నాయి.
