రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. సీ6

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. సీ6

రాయల్ ఎన్‌‌ఫీల్డ్ ఎలక్ట్రిక్​ బైక్ ​బ్రాండ్​ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ ​బైక్ ​‘సీ6’  హైదరాబాద్​ మార్కెట్లోకి  వచ్చేసింది. ఎక్స్ షోరూమ్  ధర రూ.2.79 లక్షలు. బ్యాటరీ కిరాయి విధానంలో అయితే రూ.రెండు లక్షలు.  ఒకసారి చార్జ్​చేస్తే 154 కిలోమీటర్లు వెళ్తుంది. 

టాప్​ స్పీడ్ ​గంటకు 115 కిలోమీటర్లు.  కార్బన్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, కార్నరింగ్​ ఏబీఎస్​, కీలెస్ స్టార్ట్, ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. ఎలక్ట్రిక్​ బైకుల అమ్మకాల కోసం హైదరాబాద్​లో నాలుగు ఔట్​లెట్లను కూడా ప్రారంభించామని ఫ్లయింగ్​ ఫ్లీ తెలిపింది.