న్యూఢిల్లీ: మనదేశం 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో దక్షిణ భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషించనుందని కమోడిటీస్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ బిగ్ మింట్ వెల్లడించింది. దక్షిణాదిలో ప్రస్తుతం 46 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘ఫ్యూచర్ స్టీల్’ సదస్సులో ఈ వివరాలు వెల్లడించింది.
తెలంగాణ ఐరన్ , స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టిస్మా) ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ది స్ట్రక్చరల్ గ్యాప్’ నివేదికను విడుదల చేశారు.
దక్షిణాదిలో ఉక్కు రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మెరుగైన లాజిస్టిక్స్, పర్యావరణహిత సాంకేతికతలు, మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరమని పారిశ్రామికవేత్తలు వివేక్ నిశాం, జీఎల్ గుప్తా, కేకే మహేశ్వరి, వినోద్ కుమార్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
