ఎరువుల సరఫరాకు చర్యలు..వెలుగు కథనాలకు స్పందన..

ఎరువుల సరఫరాకు చర్యలు..వెలుగు కథనాలకు స్పందన..

కొణిజర్ల, వెలుగు: సింగరాయపాలెం జాగీర్దారీ భూములతో పాటు ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పోడు సాగు చేస్తున్న రైతుల సమస్యలపై ‘వెలుగు’ పత్రిక ప్రచురించిన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. పట్టాలు ఉన్నప్పటికీ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూముల వివరాలు నమోదు కాక యూరియా, ఇతర ఎరువులు పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయా భూములకు కూడా ఎరువులు అందించేలా నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) విధానాన్ని అమలు చేయాలని సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. రైతుల భూములకు సంబంధించిన ఆధారాలను క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఈవోకు సమర్పించాలని సూచించారు.

దరఖాస్తుతో పాటు ఆధారాలు అందిస్తే నిబంధనల మేరకు తాత్కాలికంగా భూముల వివరాలను నమోదు చేసి ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో పోడు రైతులతో పాటు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూ వివరాలు నమోదు కాని ఇతర రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.