- అనాథ, నిరుపేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషనే నా లక్ష్యం
చార్మినార్, వెలుగు: నిరుపేద, అనాథ పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడమే తన జీవిత ఆశయమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. చాంద్రాయణగుట్ట బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టూ పీజీ కాలేజీ క్యాంపస్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు చెక్కులతో పాటు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా అక్బర్మాట్లాడుతూ ‘సాలార్ -ఎ -మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ద్వారా సేవలను నిరంతరం కొనసాగిస్తానని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
తన విద్యాసంస్థలను కూలుస్తానని బెదిరించినా భయపడేది లేదన్నారు. ఒకవేళ నిరుపేదల కోసం కట్టిన ఒక్క విద్యాసంస్థను తాకినా, దానికి బదులుగా పది కొత్త విద్యా సంస్థలను నిర్మించి చూపిస్తానని సవాల్ విసిరారు.
పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు, నిరుపేద యువతులకు ఉచితంగా నీట్ కోచింగ్ ఇవ్వడం, మహిళా సాధికారతకు తోడ్పడటం వంటి పనులను ఏ శక్తులూ ఆపలేవన్నారు. తన కొడుకు చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేస్తాడని అంటున్నారని, అలాంటిదేమీ
లేదన్నారు.
