నల్గొండలో  ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ప్రారంభం.. సినీతార రితికా నాయక్ రాకతో సందడి

నల్గొండలో  ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ప్రారంభం.. సినీతార రితికా నాయక్ రాకతో సందడి
  • సినీతార రితికా నాయక్ రాకతో సందడి
  • దసరా, దీపావళి పండుగల కోసం ప్రత్యేక వస్త్ర సంపద

నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణంలో వస్త్ర ప్రపంచానికి సరికొత్త వేదికగా ‘ది చెన్నై షాపింగ్ మాల్’ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ తార రితికా నాయక్ ముఖ్య అతిథిగా వచ్చారు. మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూసీ కోర్ర లక్ష్మి, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకట్ రెడ్డి, డైరెక్టర్ కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ యామా కవితా దయాకర్‌‌‌‌‌‌‌‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. రితికా నాయక్ షోరూమ్‌‌‌‌‌‌‌‌లోని వివిధ విభాగాలను, పట్టు చీరలు, ఆధునిక ట్రెండీ కలెక్షన్లను పరిశీలించారు. నల్గొండ ప్రజల ఆదరణ పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

నిర్వాహకులు మాట్లాడుతూ దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులందరికీ సరిపడే నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించేలా ఈ షోరూమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మారుతున్న ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ ధోరణులకు తగినట్లుగా విభిన్న డిజైన్లతో సంప్రదాయ, ఆధునిక వస్త్రాలు ఒకే చోట లభించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు సన్మానించారు.  కార్పొరేటర్లు అల్లి మల్లికార్జున్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, పున్న గణేశ్, వంగాల అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.