హైదరాబాద్లో విషాదం.. గేటెడ్ కమ్యూనిటీలో సెప్టిక్ ట్యాంకులో క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి

హైదరాబాద్లో విషాదం..  గేటెడ్ కమ్యూనిటీలో సెప్టిక్ ట్యాంకులో క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి

హైదరాబాద్ లో ఘోర విషాద ఘటన జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2026 నవంబర్ 24న సెప్టిక్ ట్యాంకులో పడి ముగ్గురు యువకులు చనిపోయారు. దీపక్ హారీక్ అపార్ట్మెంట్ లో డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వచ్చిన యువకులు ప్రమాదవశాత్తు చనిపోయారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి హైడ్రా టీమ్ కు సమాచారం ఇచ్చారు. మృతులను వెలికి తీసి పోస్టు మార్టమ్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులను హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కెంపెనీ కి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారిని సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే వ్యక్తులుగా గుర్తించారు.  

కార్మికుల మృతి పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాచుపల్లి పోలీసులు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.